క్రైమ్ మిర్రర్ : కుటుంబంలో తలెత్తిన మనస్పర్థల కారణంగా ఓ మహిళా ఐటీ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన రమాకాంత్, మౌనికలకు గతంలో ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ పోచారంలోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం వీరు పోచారం సంస్కృతి టౌన్షిప్ సమీపంలోని ‘గెలాక్సీ టవర్స్’ విశ్వ ఈ-బ్లాక్, ఫ్లాట్ నంబర్ 202లో నివాసముంటున్నారు.
శనివారం రాత్రి తమ అపార్ట్మెంట్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో దంపతులిద్దరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున వారి మధ్య అనుకోకుండా తీవ్రమైన గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన మౌనిక వెంటనే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
also read : కారు రూపంలో వచ్చిన కాలయముడు.. మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే దుర్మరణం!
