Homeక్రైమ్ప్రేమ, ఈర్ష్యతోనే యువతి మర్డర్.. లెక్చరర్‌తో పాటు మరో వ్యక్తి అరెస్ట్!

ప్రేమ, ఈర్ష్యతోనే యువతి మర్డర్.. లెక్చరర్‌తో పాటు మరో వ్యక్తి అరెస్ట్!

క్రైమ్ మిర్రర్ : గోదావరిఖని-1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన యువతి అనుమానాస్పద మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన హత్య అని నిర్ధారణ అయింది. ఈ దారుణ ఘటనలో ప్రధాన నిందితుడితో సహా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలు

పోలీస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు నవీన్‌కుమార్ సీసీసీ నస్పూర్‌లోని సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తుండగా, రెండో నిందితుడు రవికుమార్ సింగరేణిలో ఓవర్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 2022లో కళాశాలలో చదువుతున్న సమయంలో సదరు యువతితో లెక్చరర్ నవీన్‌కుమార్‌కు పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. అయితే, కొంతకాలంగా ఆ యువతి రవికుమార్‌తో సన్నిహితంగా ఉండటాన్ని నవీన్‌కుమార్ సహించలేకపోయాడు. దాంతో ఆమెను అంతమొందించాలని ముందస్తు ప్లాన్ వేశాడు.

కారులో గొడవ.. ఆస్పత్రికి తరలించడంలో జాప్యం

సెప్టెంబర్ 12న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న యువతిని నవీన్ తన కారులో ఎక్కించుకున్నాడు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ ఆమెతో తీవ్రంగా గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమె విషపదార్థం మింగడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. అయితే, ఆమెకు తక్షణమే అత్యవసర వైద్య సహాయం అందించకుండా నవీన్ కావాలనే సమయాన్ని వృథా చేశాడు. పరిస్థితి పూర్తిగా విషమించిన తర్వాత ఆమెను ఇంటి వద్ద దింపి, కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రికి తరలించి అక్కడ నుంచి పరారయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.

సాంకేతిక ఆధారాలతో అరెస్ట్:

ఘటన అనంతరం ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు, కాల్ రికార్డింగ్స్ ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుల కదలికలను గుర్తించారు. లెక్చరర్, నవీన్‌కుమార్‌తో పాటు హత్యా నేరంలో భాగస్వామి అయిన రవికుమార్‌ను అరెస్ట్ చేశారు. రవికుమార్‌పై కూడా గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు.
also read : ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి, పాక్ సరిహద్దు నెట్‌వర్క్‌పై ఇన్వెస్టిగేషన్!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు