అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ఏకంగా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) పేరు మార్చాలనే సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. నిత్యం టారిఫ్‌లు, అంతర్జాతీయ యుద్ధాలు, రాజకీయ పరిణామాలతో బిజీగా ఉండే ట్రంప్‌కు వీటితో బోర్ కొట్టిందేమో గానీ, ఇప్పుడు ఆయన దృష్టి ఏఐ వైపు మళ్లింది.
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అనే పదం చాలామందికి సరిగ్గా సరిపోలేదని, ఇది ఆశించినంత ప్రభావవంతంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఏఐ పేరును మార్చాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ఆసక్తికరమైన పోల్ నిర్వహించారు. సుపీరియర్ ఇంటెలిజెన్స్ (SI), ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ (EI), అలాగే సుప్రీమ్ ఇంటెలిజెన్స్ (SI) వంటి పేర్లలో ఏది అత్యంత సరిగ్గా ఉంటుందో ప్రజలు ఓటు వేసి తెలపాలని కోరారు.ట్రంప్ పెట్టిన ఈ పోల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం చాలా ఫన్నీగా, విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఇప్పుడు ఏఐ పేరు మార్చాల్సిన అవసరం ఏముందని, దీనివల్ల ప్రయోజనం ఏమిటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ట్రంప్ చేపట్టిన ఈ వినూత్న సర్వే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెట్టింట వైరల్ అవుతోంది.
కత్తితో పొడిచి యువకుడి హత్య.. పరారీలో నిందితుడు
