Homeక్రైమ్గణేష్ ఉత్సవాల్లో తీవ్ర విషాదం.. విద్యుత్ ఘాతంతో చిన్నారితో సహా ఇద్దరు మృతి!

గణేష్ ఉత్సవాల్లో తీవ్ర విషాదం.. విద్యుత్ ఘాతంతో చిన్నారితో సహా ఇద్దరు మృతి!

క్రైమ్ మిర్రర్ : ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్ ప్రాంతంలో జరుగుతున్న గణేష్ ఉత్సవాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. గణపతి మండపం వద్ద విద్యుత్ షాక్ తగలడంతో ఒక చిన్నారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో గణేష్ మండపం వద్ద భక్తులు దర్శనం చేసుకుంటుండగా ఊహించని రీతిలో విద్యుత్ వైర్లు తాకి భక్తులకు కరెంట్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిని తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని బైకుల్లా మసీనా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తరలించే మార్గంలోనే రాఘణి ఘన్‌శ్యామ్ యాదవ్ (8) అనే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో మహిళ పరేల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. మిగిలిన బాధితులు కిరణ్ అక్బర్ నాయక్, తన్వి నర్ష్ హాండే, సాహిల్ సందీప్ తారే, రూహి సింగ్‌లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
also read : హత్య కేసు: 5,053 పేజీల భారీ ఛార్జిషీట్ దాఖలు.. వెలుగులోకి నిశ్చితార్థం సంచలన నిజాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు