Homeక్రైమ్ఆస్పత్రిలోనే ప్రమాదం.. మహిళపై కూలిన స్లాబ్‌.. రాజస్థాన్ లో ఘటన

ఆస్పత్రిలోనే ప్రమాదం.. మహిళపై కూలిన స్లాబ్‌.. రాజస్థాన్ లో ఘటన

రాజస్థాన్‌లోని సుజన్‌గఢ్‌లో ప్రభుత్వ ఆస్పత్రిలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. చికిత్స కోసం వచ్చిన ఓ మహిళకు ఆస్పత్రి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ప్రమాదం ఎదురైంది.

ఆస్పత్రి భవనం నుంచి బయటకు వస్తుండగా ఒక్కసారిగా పైకప్పు స్లాబ్‌ కూలి ఆమెపై పడింది. దీంతో మహిళ తీవ్రంగా గాయపడి కిందపడిపోయింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆమె అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటన మొత్తం ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డైంది. స్లాబ్‌ కూలిన ఘటనతో ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు.

గాయపడిన మహిళకు అదే ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి భవనం భద్రతపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనకు సంబంధించి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

also read: అమెరికా రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణ విద్యార్థుల వీసాలపై కీలక విజ్ఞప్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు