Homeతెలంగాణబాలిక అనుమానాస్ప‌ద మృతి....! గ్రామంలో విషాదం...

బాలిక అనుమానాస్ప‌ద మృతి….! గ్రామంలో విషాదం…

చిత్తూరు, క్రైమ్‌మిర్ర‌ర్‌: చిత్తూరు జిల్లాలో బాలిక అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. గంగవరం మండలం బండమీద జరావారిపల్లెలో బాలిక శిరీష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో ఒక్క‌సారిగా విషాదం నెల‌కొంది. కాగా తమ బిడ్డను హత్య చేశారని తల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు. బాలికకు తీవ్ర జ్వరం రావడంతో సోమ‌వారం ఇంటిలో ఒంటరిగా ఉంది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసిన తల్లిదండ్రులకు ఆమె ఉరివేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Also Read:అండమాన్ నుంచి క‌రెంటు..! ఎలా సాధ్యం..

నా బిడ్డ‌ను హ‌త్య‌చేశారంటూ త‌ల్లిదండ్రుల ఆందోళ‌న‌…

తమ బిడ్డది ఆత్మహత్య కాదని, హత్య అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని ఓ యువకుడితో చనువుగా మాట్లాడటం చూసి శిరీషకు యువకుడి తండ్రి నాగరాజు వార్నింగ్ ఇచ్చినట్లు వారు చెబుతున్నారు. తన కూతురి మృతికి నాగరాజే కారణమని ఆరోపించారు. ప్రస్తుతం నాగరాజు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read:ఓంకారేశ్వరం రహస్యం… నర్మదా నదీ మధ్యలో వెలసిన దివ్య జ్యోతిర్లింగ మహిమ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు