క్రైమ్ మిర్రర్ కల్వకుర్తి (తలకొండపల్లి): తలకొండపల్లి మండలం జూలపల్లి గ్రామంలో శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ సర్పంచ్ కడారి శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, టాస్క్ సి ఓ ఓ ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్ తదితరులు వేరువేరుగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో కీలక మని, గ్రామాల్లో ఐక్యత, శాంతి, భక్తి భావం పెంపొందించడంలో దేవాలయాల పాత్ర ముఖ్యమైనదని, అలాగే ప్రజా సేవతో పాటు సమాజంలో ఆధ్యాత్మిక విలువలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో.. గ్రామ ఉప సర్పంచ్ ఇంద్రకంటి శ్రీశైలం గౌడ్, వార్డు సబ్యులు స్థానిక నాయకులు రాఘవేందర్ ముదిరాజ్, అల్లాజీ గౌడ్, కడారి పర్వతాలు యాదవ్, భాషామోని సాయికుమార్, సుధాకర్ యాదవ్, సురేష్ గౌడ్, శేఖర్ గౌడ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు