Homeఆంధ్ర ప్రదేశ్కింజరాపు రామ్మోహన్ నాయుడు కు షాక్...!

కింజరాపు రామ్మోహన్ నాయుడు కు షాక్…!

  • పౌర విమానయాన శాఖ నుంచి తొలగింపు

  • కొత్తగా పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయింపు

  • మంత్రివర్గ విస్తరణలో చేర్పులు, మార్పులు

ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: కేంద్ర మంత్రివర్గం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు తొలగింపు ఉంటుందా? ఆయనను కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి తొలగిస్తారా? వేరే శాఖను కేటాయిస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడంతో.. కచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈనెల 15న విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈనెల 20న తిరిగి చేరుకోనున్నారు. ఏ క్షణంలోనైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ సారి కీలక శాఖలకు సంబంధించిన మంత్రుల ఉద్వాసన ఉంటుందన్న ప్రచారం ఉంది. అందులో ప్రధానంగా కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరు వినిపిస్తోంది.

కీలకమైన శాఖ కేటాయింపు…

2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి విజయం సాధించారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. కేంద్రంలో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడంతో మంత్రివర్గంలో ఆ పార్టీకి ఛాన్స్ దక్కింది. కింజరాపు రామ్మోహన్ నాయుడు తో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం దక్కింది. అయితే రామ్మోహన్ నాయుడుకు ఏకంగా పౌర విమానయాన శాఖ దక్కడం విశేషం. అయితే వరుసగా పౌరవిమానయాన శాఖలో జరిగిన పరిణామాలతో రామ్మోహన్ నాయుడు పనితీరుపై విమర్శలు వచ్చాయి. పౌర విమానయాన శాఖ విషయంలో కొన్ని చేదు అనుభవాలు ఆయనకు ఎదురయ్యాయి.

2025 జూన్ 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు తరువాత ఇండిగో విమాన సంక్షోభంలో సైతం పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారని ఆరోపణలు వినిపించాయి. అటు తర్వాత మహారాష్ట్రలో విమాన ప్రమాదంలో అక్కడి డిప్యూటీ సీఎం అజిత్ పవర్ మృతి చెందారు. ఇలా వరుస ఘటనలు కింజరాపు రామ్మోహన్ నాయుడు నిర్వహిస్తున్న శాఖ పరిధిలో ఉండడంతో.. ఆయన చుట్టూ విమర్శలు వచ్చాయి.

శాఖ మార్పు ఖాయం…

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కింజరాపు రామ్మోహన్ నాయుడుకు శాఖ మార్పు ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. ఆయనకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయిస్తారన్న టాక్ నడుస్తోంది. గతంలో ఆయన తండ్రి కింజరాపు ఎర్రం నాయుడు ఆ పదవులు నిర్వర్తించేవారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడుకు అదే శాఖలు కేటాయించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ మంత్రిగా అవకాశం దక్కినప్పుడే భిన్న స్వరం వినిపించింది. తొలుత తన తండ్రి నిర్వహించిన పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను ఇస్తారని భావించారు. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో తన తండ్రి పదవులు ఆయనకు ఇస్తారని ప్రచారం సాగుతోంది.

ఆ ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం…

తెలుగుదేశం పార్టీలో కింజరాపు కుటుంబానికి ప్రత్యేక స్థానం. చంద్రబాబు కుడి భుజంగా ఉండేవారు కింజరాపు ఎర్రం నాయుడు. ఇదే టిడిపి ద్వారా ఆయన శ్రీకాకుళం ఎంపీగా చాలాసార్లు ప్రాతినిధ్యం వహించారు. వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2010లో అకాల మరణం చెందారు. ఆయన వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. మంచి వాగ్దాటితో మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా ఎదిగారు. మూడుసార్లు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. చిన్న వయసులోనే కేంద్ర మంత్రివర్గం లో చోటు దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఆయన మార్పు ఉంటుందన్న ప్రచారం ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు