Homeఆంధ్ర ప్రదేశ్షర్మిల వర్సెస్ రఘువీరారెడ్డి... రాజ్యసభ పదవి కోసం పోటాపోటీ...!

షర్మిల వర్సెస్ రఘువీరారెడ్డి… రాజ్యసభ పదవి కోసం పోటాపోటీ…!

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టింది హై కమాండ్. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రభావం చూపాలని భావిస్తోంది. అందుకు అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఏపీ నుంచి ఒక నేతకు రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య పోటా పోటీ ఉంది. ముఖ్యంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరో మాజీ మంత్రి కి సైతం అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ముందు వరుసలో మాత్రం వైయస్ షర్మిల ఉన్నారు.

రాజ్యసభ పదవులు ఖాళీ…

జూన్లో దేశవ్యాప్తంగా 70 మందికి పైగా రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ నుంచి నలుగురు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. అలాగే కర్ణాటక నుంచి ఓ నలుగురు సభ్యులు రిటైర్ కానున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎన్నిక అనివార్యం. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 135 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి ఉంది. జెడిఎస్ సైతం ఓ 19 సీట్లలో విజయం సాధించింది. కర్ణాటక నుంచి మల్లికార్జున్ ఖర్గేతో పాటు దేవే గౌడ, మరో ఇద్దరూ పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. కాంగ్రెస్ పార్టీకి మూడు రాజ్యసభ స్థానాలు.. బిజెపికి ఒకటి దక్కే అవకాశం ఉంది. అయితే కర్ణాటక నుంచి ఏపీకి చెందిన నేతను రాజ్యసభకు పంపించాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది.

షర్మిల కు ఛాన్స్ …

ఏపీ నుంచి పంపించాలనుకుంటే పిసిసి అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు తీసుకున్నారు. అయితే అప్పట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. కానీ ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే రాజ్యసభకు చాన్స్ ఇస్తామని అప్పట్లోనే ఆమెకు హామీ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఆ హామీ మేరకు ఇప్పుడు ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారని సమాచారం. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి షర్మిలకు. ఆమె అక్కడి డిప్యూటీ సీఎం శివకుమార్ ఆశీస్సులతోనే ఏపీ పగ్గాలు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కచ్చితంగా ఆయన సహకారంతో కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిల వెళ్తారని జోరుగా ప్రచారం నడుస్తోంది.

రఘువీరా పేరు పరిశీలన…

మరోవైపు మాజీ మంత్రి, ఏఐసీసీ మెంబర్ ఎన్ రఘువీరారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. సుదీర్ఘకాలం అదే పార్టీలో కొనసాగారు. ఏ పార్టీ వైపు కూడా తొంగి చూడలేదు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014 వరకు ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉండేవారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది.

ఆ సమయంలో పార్టీ పగ్గాలు తీసుకున్నారు రఘువీరారెడ్డి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గట్టిగానే కృషి చేశారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందుకే ఇప్పుడు కర్ణాటక ద్వారా రాజ్యసభకు ఆయనను పంపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే షర్మిల, రఘువీరారెడ్డి లో ఒకరికి రాజ్యసభ పదవి ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు