Homeఆంధ్ర ప్రదేశ్అవినీతి నియంత్రణలో తెలంగాణ భేష్!

అవినీతి నియంత్రణలో తెలంగాణ భేష్!

-దూకుడుగా వ్యవహరిస్తున్న అక్కడ ఏసీబీ
-వందల కోట్ల అవినీతి అధికారులు టార్గెట్
-ఏపీలో మాత్రం అందుకు విరుద్ధం
-కిందిస్థాయి సిబ్బందిపైనే ప్రతాపం
-వలకు చిక్కని పెద్ద చేపలు

క్రైమ్ మిర్రర్,తెలంగాణ :-
రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. అవినీతి నిరోధక శాఖ పనితీరు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గత కొంతకాలంగా తెలంగాణలో ఏసీబీ దాడులు విస్తృతంగా కొనసాగాయి. పక్కా ప్రణాళికతో… గ్రౌండ్ వర్క్ చేసి మరి వందల కోట్ల అక్రమార్జనకు పాల్పడిన అవినీతి అధికారుల భరతం పట్టారు తెలంగాణ ఏసీబీ అధికారులు. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వ్యవహరించి.. అవసరం అనుకుంటే సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సైతం వదిలిపెట్టేది లేదన్న బలమైన సంకేతాలు పంపుతున్నారు. కానీ ఏపీలో మాత్రం ఆ స్థాయిలో ప్రయత్నాలు జరగడం లేదు. ఏసీబీ నుంచి భారీ రైడింగ్ లు జరగడం లేదు. దీనిపైన ఇప్పుడు చర్చ నడుస్తోంది.

చిన్నచిన్న ట్రాప్ లకే పరిమితం…
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏసీబీ దాడులు పరిస్థితి చూస్తే మాత్రం.. చిన్నచిన్న ట్రాప్ లకే పరిమితం అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి చంద్రబాబు పాలనా వ్యవస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. అవినీతి అక్రమాలపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటారని అంతా భావిస్తారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. తెలంగాణతో పోల్చుకుంటే భారీ అవినీతి దాడులు, తనిఖీలు కనిపించకపోవడం మాత్రం ఆశ్చర్యం వేస్తోంది.

అవినీతి పెరుగుదల..
ఏపీలో అవినీతి బాగా పెరిగిపోయిందన్న విమర్శ ఉంది. గత ప్రభుత్వ వాసనలు పోలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మొదట వ్యవస్థలను సమూలంగా సమీక్షించడం, ఆధారాల సేకరణ, సాంకేతిక నిఘాను బలోపేతం చేసుకోవడం వంటి వాటిపై దృష్టి పెడతారు. పెద్ద స్థాయి అధికారులపై చేతులు వేయాలంటే బలమైన ప్రాథమిక ఆధారాలు, కోర్టులో నిలబడే చట్టబద్ధమైన సాక్షాలు చాలా అవసరం. కానీ ఏపీలో అటువంటి ఆపరేషన్ లేవి కనిపించడం లేదు. దీంతో అవినీతి విపరీతంగా పెరుగుతోందని ఓటమి పార్టీ ఎమ్మెల్యేలే వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది.

ప్రజల డిమాండ్ అదే..
తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ ఉన్నత స్థాయిలో ఉన్న అవినీతి పై ఉక్కు పాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం చిన్న స్థాయి ఉద్యోగులను మాత్రమే కాదు.. వందల కోట్ల ఆశిస్తున్న అధికారులపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వేలకోట్ల అక్రమాలకు పాల్పడుతున్న అవినీతి తిమింగలాల ఉచ్చు బిగించినప్పుడే ప్రజలకు పాలనపై నమ్మకం కుదురుతుంది. ప్రజాధనాన్ని పక్కదో పట్టించిన బడా అధికారుల జాబితాను తయారుచేసి.. పక్కా ప్రణాళికతో ఏసీబీని రంగంలోకి దించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణ ఏసీబీ దూకుడుగా ఉంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు