క్రైమ్ మిర్రర్ : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శనివారం ఆయనను స్వయంగా విచారించినట్లు సమాచారం. విచారణలో సూసైడ్ నోట్‌కు సంబంధించిన అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. తాను రాసిన ఆ నోట్‌లో కేసుకు సంబంధించిన ఆధారాలను ఐఫోన్‌లో భద్రపరిచినట్లు పేర్కొన్నప్పటికీ, ఆ ఫోన్ ప్రస్తుతం కనిపించడం లేదని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. సూసైడ్ నోట్‌లో ఏం రాశారనే దానిపై అధికారులు ప్రశ్నించినా ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న సమయంలోనే ఆ నోట్ రాసినట్లు కస్టడీలో ఆయన చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ నోట్ ఎక్కడ ఉందో తనకు తెలియదని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అయితే అసలు సూసైడ్ నోట్ ఎక్కడికి వెళ్లింది? అది బయటకు ఎలా వచ్చింది? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. ఈ ప్రశ్నలకు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది. దీంతో మిస్సింగ్ నోట్, కనిపించని ఐఫోన్ వ్యవహారంపై దర్యాప్తు మరింత కీలకంగా మారింది.
also read : లాయర్ ఇంట్లో నలుగురు దొంగల హల్‌చల్.. కాళ్లు, చేతులు కట్టేసి మరీ దోపిడీ
