Homeఆంధ్ర ప్రదేశ్స్థానిక ఎన్నికల సమరం: సీట్ల విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్న పవన్ కళ్యాణ్!

స్థానిక ఎన్నికల సమరం: సీట్ల విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్న పవన్ కళ్యాణ్!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేడి అప్పుడే ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక పోరులో సీట్ల కేటాయింపు విషయంలో జనసేన ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని, ఈసారి తగ్గేది లేదని స్పష్టం చేశారు. జనసేన శ్రేణులంతా స్థానిక ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.గత 2024 సార్వత్రిక ఎన్నికల సమయాన్ని గుర్తుచేస్తూ పవన్ కళ్యాణ్ కీలక విషయాలను వెల్లడించారు. ఆ సమయంలో బీజేపీని కూటమిలోకి తీసుకురావాల్సిన అవసరం వచ్చినందున, టీడీపీ అభ్యర్థన మేరకు జనసేన కొన్ని స్థానాలను తగ్గించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే, అదే సూత్రాన్ని ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలకు కూడా వర్తింపజేస్తామంటే అసలు ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు.

హీరో నాని అభ్యర్థన.. సీఎం రేవంత్ సానుకూల స్పందన!

ఒకవేళ సీట్ల సర్దుబాటు కుదరక, ఒకే వార్డులో మిత్రపక్షంతో కలసి పోటీ చేయాల్సి వచ్చినా సరే వెనకడుగు వేయకుండా ము ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) గురించి మాట్లాడుతూ, ఆ పార్టీపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదా అయిష్టం లేదని వివరణ ఇచ్చారు. కేవలం వారి గత పాలనలో తీసుకున్న నిర్ణయాలు, విధానాలనే తాము తీవ్రంగా విభేదించామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

నిమ్స్ లో అవినీతి డాక్టర్…! ఆదాయానికి మించిన ఆస్తులు…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు