క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- రాష్ట్రంలో ఇటీవలి కాలంలో సంభవించిన రెండు తీవ్ర తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ప్రాణ, ఆస్తినష్టాలతో పాటు కోలుకోలేని దెబ్బ తీసిన ఈ ప్రకృతి విపత్తుల నేపథ్యంలో, రాష్ట్ర పునర్నిర్మాణానికి మరియు తక్షణ సహాయక చర్యల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ మధ్యంతర ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అధికారికంగా లేఖ రాశారు.
తాజాగా రాష్ట్రంలో జరిగిన తీవ్ర నష్టాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదిక అందజేశారు. కేవలం మురుసు తుఫాన్ ప్రభావం వల్లే రాష్ట్రంలో అంచనాలకు మించి భారీ నష్టం వాటిల్లినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఒక్క తుఫాన్ వల్ల సుమారు రూ. 1,919.59 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడించాయి. వ్యవసాయం, ఉద్యానవన రంగాలతో పాటు మౌలిక వసతులు దెబ్బతిని రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
భారీగా దెబ్బతిన్న పంటలు.. రంగాలవారీగా అంచనా నష్టాలు:- తుఫాన్లు సృష్టించిన బీభత్సం కారణంగా అన్నదాతలు కోలుకోలేని స్థితికి చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,43,122 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులో ఉన్న పంటలు నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా:
పంటల నష్టం మరియు ఇతర వనరుల ధ్వంసం వల్ల కేవలం వ్యవసాయ రంగానికి మాత్రమే రూ. 874.96 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
ఉద్యానవన పంటలకు తీవ్ర విఘాతం కలగడంతో ఈ రంగానికి రూ. 337.10 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు.
చేతికొచ్చిన పంటలు నీటిపాలవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అప్పులపాలైన రైతాంగాన్ని ఆదుకోవడానికి, దెబ్బతిన్న ప్రాంతాలను తక్షణమే పునరుద్ధరించడానికి భారీ ఎత్తున నిధులు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.తుఫాన్ల వల్ల రాష్ట్రంలో జరిగిన సంపూర్ణ నష్టానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను రాబోయే 15 రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా సమర్పిస్తామని చంద్రబాబు తెలిపారు. అప్పటివరకు రాష్ట్రంలో సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతాయని, కేంద్రం స్పందించి మానవతా దృక్పథంతో తక్షణ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బాలయ్య అభిమానుల్లో ఫుల్ జోష్…! దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడో తెలుసా….
