Homeజాతీయండ్రగ్స్ రహిత భారతదేశంగా తీర్చిదిద్దటమే కేంద్రం లక్ష్యం : అమిత్ షా

డ్రగ్స్ రహిత భారతదేశంగా తీర్చిదిద్దటమే కేంద్రం లక్ష్యం : అమిత్ షా

భారతదేశాన్ని 2029 డిసెంబర్ 31 నాటికి పూర్తిగా డ్రగ్స్ రహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దిల్లీ వేదికగా నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యాంటీ-నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఆయన ఈ అంశంపై అత్యంత స్పష్టమైన డెడ్‌లైన్‌ను ప్రకటించారు. దేశంలోని ప్రతి గ్రామంలోకి ఒక్క గ్రాము మత్తు పదార్థం కూడా రాకూడదని, అలాగే దేశం నుండి బయటికి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేవలం ఎక్కడో డ్రగ్స్ పట్టుకున్నట్లు వచ్చే నామమాత్రపు వార్తల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, అసలు ఆ డ్రగ్స్ మాఫియా వెనుక ఉన్న భారీ నెట్‌వర్క్‌ను మూలాలతో సహా పూర్తిగా ధ్వంసం చేసినప్పుడే ప్రభుత్వం నిర్దేశించుకున్న అసలు లక్ష్యం నెరవేరుతుందని ఆయన ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం తీసుకోవాల్సిన కఠిన చర్యలపై అధికారులకు తగిన దిశానిర్దేశం చేశారు.

స్థానిక ఎన్నికల సమరం: సీట్ల విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్న పవన్ కళ్యాణ్!

నిరుద్యోగుల‌కు ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌…! 2500 ఉపాధ్యాయ పోస్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు