Homeక్రైమ్ఆస్తాకుంజ్ పార్క్‌లో బాలికపై సామూహిక లైంగిక దాడి.. ముగ్గురు నిందితుల అరెస్ట్

ఆస్తాకుంజ్ పార్క్‌లో బాలికపై సామూహిక లైంగిక దాడి.. ముగ్గురు నిందితుల అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : దేశ రాజధాని ప్రాంతంలో మహిళల రక్షణపై మళ్లీ తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఆస్తాకుంజ్ పార్క్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. సదరన్ రేంజ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీదాబాద్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక తన మైనర్ స్నేహితుడితో కలిసి ఆదివారం సాయంత్రం కాల్కాజి ఆలయాన్ని దర్శించుకుంది. అనంతరం వారిద్దరూ సమీపంలోని ఆస్తాకుంజ్ పార్క్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు తమను పోలీసులుగా పరిచయం చేసుకుంటూ వారిని బెదిరించడం ప్రారంభించారు. అనంతరం ఇద్దరు నిందితులు బాలుడిని పట్టుకుని బంధించగా, ఆసిఫ్ అనే వ్యక్తి తుపాకీతో బెదిరించి బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ దారుణానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు.

పోలీసుల ఎదురుకాల్పులు – నిందితుల అరెస్ట్ 

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రధాన నిందితుడు ఆసిఫ్‌ను పట్టుకునే క్రమంలో అతను పోలీసులపైకి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు వెంటనే ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపగా, ఆసిఫ్ కాలికి గాయమైంది. ప్రస్తుతం ఈ కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వరుస ఘటనలపై విపక్షాల ఆగ్రహం

ఢిల్లీ ప్రాంతంలో ఒకే నెలలో వరుసగా మూడు మైనర్ లైంగిక దాడి కేసులు నమోదు కావడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సెప్టెంబర్ 12న స్వరూప్ నగర్‌లో 14 ఏళ్ల బాలికపై సామూహిక దాడి చేసి హత్య చేయడం, సెప్టెంబర్ 16న సదర్ బజార్‌లో 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరగడం వంటి ఘటనలను ప్రస్తావిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్ర విమర్శలు గుప్పించింది. రాజధానిలో బాలికలు, మహిళల భద్రత పూర్తిగా మృగ్యమైందని ఆరోపించింది.
also read : తెలంగాణలో దసరాకు కొత్త పింఛన్లు…! సీఎం ఆదేశం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు