Homeక్రైమ్ఆయుధాల చోరీ కేసు.. పోలీసుల విచారణలో నిందితుడు మల్లేష్ కీలక నిజాలు వెల్లడి!

ఆయుధాల చోరీ కేసు.. పోలీసుల విచారణలో నిందితుడు మల్లేష్ కీలక నిజాలు వెల్లడి!

క్రైమ్ మిర్రర్ : సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు మల్లేష్‌ను విచారించిన బొల్లారం పోలీసులకు పలు ఆసక్తికర, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నాలుగు నెలల ముందే పక్కా ప్లాన్

ఈ ఆయుధాల చోరీకి మల్లేష్ దాదాపు నాలుగు నెలల క్రితమే స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం రోజు ఆర్మీ అధికారులు, గార్డ్ ఇన్‌చార్జ్‌ల కదలికలు తక్కువగా ఉంటాయని, పైగా సెలవు దినం కావడంతో పహారా సడలింపుగా ఉంటుందని భావించి ఆ రోజే చోరీకి ఎంచుకున్నాడు.

సంఘవిద్రోహ శక్తులకు విక్రయించేందుకు యత్నం

చోరీ చేసిన ఆయుధాలను విక్రయించి, ఆ వచ్చిన డబ్బుతో తన ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవాలని మల్లేష్ ప్లాన్ చేశాడు. ఇందుకోసం సోషల్ మీడియా మాధ్యమాలలో ఆయుధాలు కొనుగోలు చేసే వ్యక్తుల కోసం తీవ్రంగా వెతికినట్లు దర్యాప్తులో తేలింది.

ఆర్మీ అధికారులపై కక్ష

ఇంకో మూడేళ్ల సర్వీస్ మిగిలి ఉన్నప్పటికీ, నిబంధనల ఉల్లంఘన లేదా ఇతర కారణాలతో తనను విధుల నుంచి తొలగించడంతో ఆర్మీ ఉన్నతాధికారులపై మల్లేష్ తీవ్ర కక్ష పెంచుకున్నాడు. మద్రాస్ బెటాలియన్ నుంచి ఆయుధాలు చోరీ చేయడం ద్వారా అక్కడ పనిచేసే అధికారుల పేరు, రెజిమెంట్ ప్రతిష్ఠ దెబ్బతీయాలని భావించాడు. దాదాపు 16 ఏళ్ల పాటు మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేసిన అనుభవం ఉండటంతో, అక్కడ భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని ఈ చోరీకి పాల్పడ్డాడు.

ఆర్మీ స్నేహితుల ద్వారా సమాచారం సేకరణ

ఈ ప్లాన్ అమలు చేయడానికి ఆర్మీలోని తన పాత స్నేహితులైన ఇన్‌చార్జ్ నాయక్ వినోద్, మ్యాగజైన్ ఇన్‌చార్జ్ బల్లి మధు, గార్డ్ ఇన్‌చార్జ్ హవాల్దార్ కేవీ రమణ, క్వార్టర్ గార్డ్ ఇన్‌చార్జ్ నిరేష్‌లతో మల్లేష్ నిరంతరం ఫోన్ సంభాషణలు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. సెంటర్లోని సీసీటీవీ కెమెరాలు ఎప్పుడు ఆఫ్‌లో ఉంటాయి, భద్రత ఎప్పుడు సడలుతుందనే వివరాలను వారి నుంచి ఆరా తీసినట్లు విచారణలో నిరూపితమైంది.
also read : ఒక లేఖ.. ఓ ఫోన్‌.. సీసీ కెమెరా! ఆత్మహత్య కాదు హ‌త్యా…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు