Homeక్రైమ్రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో

రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో

క్రైమ్ మిర్రర్ : భూమి బదిలీతో పాటు పట్టా పాస్‌బుక్‌ ఇప్పించేందుకు లంచం డిమాండ్‌ చేసిన గ్రామ పరిపాలనా అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన భీమిని మండలంలోని పెద్దపేట గ్రామంలో చోటుచేసుకుంది.

పెద్దపేట గ్రామ పరిపాలనా అధికారి దుర్గాప్రసాద్‌ను ఆదిలాబాద్‌ రేంజ్‌ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ భూమిని తన పేరుపై బదిలీ చేసి, పట్టా పాస్‌బుక్‌ మంజూరు చేయాలని బాధితుడు జీపీవోను సంప్రదించాడు. ఈ పనికి మొత్తం రూ.1.30 లక్షలు ఇవ్వాలని దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

మొదటి విడతగా రూ.80 వేలు, పని పూర్తయిన తర్వాత మరో రూ.50 వేలు చెల్లించాలని ఆయన చెప్పినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు లంచం డబ్బులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు. బిట్టుపల్లికి చెందిన పోతు రాజేందర్‌ (33) స్కూటర్‌పై అక్కడికి వచ్చాడు. మొదటి విడత లంచం రూ.80 వేలను రాజేందర్‌కు అందజేయాలని జీపీవో దుర్గాప్రసాద్‌ సూచించినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు డబ్బులను రాజేందర్‌కు అందిస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఇద్దరినీ పట్టుకున్నారు. లంచం డిమాండ్‌ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై జీపీవో దుర్గాప్రసాద్‌తో పాటు అతడికి సహకరించిన పోతు రాజేందర్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని కరీంనగర్‌లోని SPE & ACB కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని అతడి వివరాలను వెల్లడించడం లేదని ఏసీబీ అధికారులు తెలిపారు.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు

ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇందుకోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు కాల్‌ చేయడంతో పాటు 9440446106 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తెలంగాణ ఏసీబీ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా కూడా సమాచారం అందించాలని సూచించారు.
also read ; జముయి బాలిక వేధింపుల కేసులో కీలక పరిణామం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు