-
లేఖ వెనుక అసలు కథ బయటపడింది!
-
ప్రేమ పేరుతో దగ్గరైన లెక్చరర్‌పై యువతి హత్య కేసు
-
గడ్డి మందు తాగించి.. ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశాడని పోలీసుల వెల్లడి
-
సీసీ కెమెరాలు, కాల్ డేటాతో బయటపడిన అసలు విషయం
గోదావరిఖని, క్రైమ్‌మిర్రర్: ఓ యువతి అనుమానాస్పద మరణం.. ఘటనా స్థలంలో లభించిన లేఖ.. మరో వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు.. మొదట చూస్తే ఇది ఆత్మహత్యగానే అనిపించింది. కానీ, పోలీసులు ఒక్కో ఆధారాన్ని కలుపుకుంటూ వెళ్లడంతో కథ పూర్తిగా మారిపోయింది. ఆ లేఖ వెనుక మరొకరి హస్తం ఉందని, యువతి మరణం వెనుక పక్కా కుట్ర ఉందని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. చివరకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ కాంట్రాక్ట్ లెక్చరర్నే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సంచలనం సృష్టించిన తాండ్ర అక్షితరాణి(20) మృతి కేసులో ఈ కీలక విషయాలను పోలీసులు బయటపెట్టారు. ఆదివారం మీడియా సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. పోలీసుల ప్రకారం.. అక్షితరాణిది ఆత్మహత్య కాదు.. హత్య.
ప్రేమ వ్యవహారం.. అక్కడే మొదలైన కథ…
Also Read:ఏఆర్ రెహమాన్‌తో పని చేయడం అంత ఈజీ కాదు.. ప్రముఖ గేయ రచయిత సమీర్ అంజాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న జెట్టి నవీన్(38)కు అదే కళాశాలలో చదువుతున్న అక్షితరాణితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందినవారే కావడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే నవీన్‌కు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో విభేదాల కారణంగా అతడు వేరుగా ఉంటున్నాడు. నవీన్, అక్షిత మధ్య ఉన్న సంబంధం గ్రామంలో తెలియడంతో యువతి కుటుంబం గోదావరిఖనికి మారినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మరో పరిచయం.. అనుమానం మొదలు…
Also Read:ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య: ప్రొఫెసర్‌పై కేసు, డీన్ పదవి నుంచి తొలగింపు
డిప్లొమా పూర్తయ్యాక అక్షిత హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ కోసం గోదావరిఖనిలోని సింగరేణి గనికి వెళ్లింది. అక్కడ ఆమెకు మెంటార్‌గా ఉన్న ఓవర్‌మెన్ బొమ్మకంటి రవికుమార్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ సన్నిహితంగా ఉండటాన్ని నవీన్ అనుమానంతో చూశాడని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా అక్షితకు తెలియకుండా ఆమె ఫోన్లో స్పై యాప్ ఏర్పాటు చేసి, ఆమె సంభాషణలను గమనించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. రవికుమార్‌తో అక్షితకు ఉన్న పరిచయంపై నవీన్ తీవ్రంగా స్పందించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మొదటి ప్రయత్నం.. ఆరోపణలతో ఫిర్యాదు…
Also Read:గూగుల్‌కు భారీ షాక్.. రూ.3,700 కోట్ల జరిమానా విధించిన ఐర్లాండ్ డేటా కమిషన్
రవికుమార్‌పై చర్యలు తీసుకునేలా చేయాలని నవీన్ ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా అక్షితతో రవికుమార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేయించినట్లు వెల్లడించారు. అయితే అందుకు తగిన ఆధారాలు లభించకపోవడంతో అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దీంతో మరో మార్గాన్ని ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు.
కారులోకి పిలుపు.. ఆ తర్వాత ఏం జరిగింది..
Also Read:వినాయకుడి మెడలో రూ.50 వేల నోట్ల దండ.. దొంగతనానికి యత్నించిన వ్యక్తికి యువకుల షాక్!
ఈ నెల 12న అక్షితను కలవాలని నవీన్ పిలిచినట్లు పోలీసులు చెప్పారు. ఆమెను తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన అనంతరం రవికుమార్ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. రవికుమార్‌పై కేసు పెట్టాలంటే ఆత్మహత్యాయత్నం చేసినట్లు చూపించాలని అక్షితను నవీన్ నమ్మించాడని, అనంతరం ఆమెతో బలవంతంగా గడ్డి మందు తాగించినట్లు పోలీసులు ఆరోపించారు. ఇక్కడితో ఆగకుండా.. అక్షిత చేతితో తన మరణానికి రవికుమారే కారణమంటూ ఒక లేఖ రాయించినట్లు తెలిపారు. ఆ లేఖను తన ఫోన్లో ఫొటో తీసుకున్నాడని చెప్పారు. అక్షిత అపస్మారక స్థితిలోకి వెళ్లే వరకు కారులోనే తిప్పిన నవీన్.. ఆమె పరిస్థితి విషమించిందని భావించిన తర్వాత ఆమె తండ్రికి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ‘మీ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది’ అని చెప్పి ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్షిత 13న మృతి చెందింది.
లేఖ పోలీసులను మరో దారిలోకి తీసుకెళ్లింది…
Also Read:ఆదిలాబాద్ రిమ్స్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
అక్షిత ఫోన్లో లభించిన లేఖ ఆధారంగా పోలీసులు తొలుత రవికుమార్‌పై కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కొన్ని విషయాలు అనుమానం కలిగించాయి. అక్షిత ఎవరితో వెళ్లింది? ఆమె చివరిసారిగా ఎవరిని కలిసింది? ఆమె మృతి చెందే ముందు జరిగిన పరిణామాలేమిటి? అనే కోణాల్లో పోలీసులు ఆధారాలు సేకరించడం ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా అక్షిత నవీన్ కారులో ఎక్కిన విషయం బయటపడింది. దీంతో దర్యాప్తు దిశ మారింది.
కాల్ డేటా.. రికార్డింగ్స్.. అసలు ట్విస్ట్…
Also Read: హైదరాబాద్‌లో తాగు నీటి వృథాపై కఠిన చర్యలు.. రూ.20 వేల వరకు జరిమానా
పోలీసులు నవీన్ ఫోన్ కాల్ డేటా, రికార్డింగ్స్, ఇతర సాంకేతిక ఆధారాలను లోతుగా పరిశీలించారు. ఒక్కో ఆధారం జతకలుస్తుండగా అక్షిత మరణానికి సంబంధించి నవీన్‌పై అనుమానాలు బలపడ్డాయి. చివరకు నవీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అక్షితను హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యగా చిత్రీకరించి, నేరాన్ని రవికుమార్‌పై మోపేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైనట్లు చెప్పారు. దీంతో ఈ కేసులో నవీన్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మరోవైపు అక్షితపై ఆరోపణలు ఎదుర్కొన్న రవికుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక లేఖను ఆధారంగా చేసుకుని మొదలైన దర్యాప్తు.. సీసీ కెమెరాల ఫుటేజీ, ఫోన్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలతో పూర్తిగా మరో మలుపు తిరిగింది. ఆత్మహత్యగా కనిపించిన అక్షితరాణి మరణం వెనుక హత్య కోణాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకురావడంతో గోదావరిఖని కేసులో అసలు ట్విస్ట్ బయటపడింది
