క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భీకరమైన భారీ వర్షం నగరంలోని పలు ప్రాంతాలను దంచికొడుతోంది. ఈ వర్షం రానున్న గంటల్లో మరింత విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరియు వెదర్‌మ్యాన్ హెచ్చరికలు జారీ చేశారు.
ముఖ్యంగా సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ అలాగే శంషాబాద్‌తో పాటు పలు కీలక ప్రాంతాలకు అధికారులు ప్రత్యేకంగా అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, ప్రజలు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తీవ్రంగా సూచించారు. ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు తిరుగుముఖం పట్టే ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకుని క్షేమంగా సేఫ్‌గా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నగరంలో నెలకొన్న ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
వైభవంగా 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక.. విజేతలకు అవార్డులు అందజేసిన రాష్ట్రపతి!
