Homeజాతీయంక్యాన్సర్ మందుల పేరిట భారీ దోపిడీ.. సుప్రీం కోర్టు సీరియస్!

క్యాన్సర్ మందుల పేరిట భారీ దోపిడీ.. సుప్రీం కోర్టు సీరియస్!

దేశంలో క్యాన్సర్ మందుల ధరల పేరుతో సాగుతున్న భారీ దోపిడీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ జరుగుతున్న ఈ అనైతిక వ్యాపారంపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. రిటైలర్ వద్ద కేవలం రూ.2,700కే లభించే ప్రాణాపాయ క్యాన్సర్ మందును, ఏకంగా రూ.27,000గా ఎంఆర్‌పీ ముద్రించి విక్రయించడం పగటిపూట దారిదోపిడీతో సమానమని ధర్మాసనం మండిపడింది.

వైభవంగా 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక.. విజేతలకు అవార్డులు అందజేసిన రాష్ట్రపతి!

ఆయుష్ పథకం కింద కొన్ని ఆసుపత్రులు ఈ రకమైన ఖరీదైన మందులను కృత్రిమంగా అధిక ధరలకు కొనుగోలు చేసి, ఆ తర్వాత ప్రభుత్వ సొమ్మును రీయింబర్స్‌మెంట్ పేరుతో క్లెయిమ్ చేసుకుంటున్నాయని కోర్టు పేర్కొంది. ఇది స్పష్టమైన నిలువుదోపిడీకి నిదర్శనమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతలో ఉండాల్సిన సంబంధిత అధికారులు ఈ అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండటం అత్యంత ఆశ్చర్యకరమని కోర్టు తీవ్రస్థాయిలో విమర్శించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం పరోక్షంగా హెచ్చరించింది.

తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సర్బూజుగా ఏర్పాట్లు: విద్యార్థుల వివరాలు సరిచూసుకోవాలని స్కూల్ హెచ్‌ఎంలకు కీలక ఆదేశాలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు