Homeఆంధ్ర ప్రదేశ్నిరుద్యోగుల‌కు ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌...! 2500 ఉపాధ్యాయ పోస్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌...

నిరుద్యోగుల‌కు ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌…! 2500 ఉపాధ్యాయ పోస్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌…

  • అక్టోబర్ 15న డీఎస్సీ నోటిఫికేషన్

  • మిగిలిన విభాగాల విద్యాసంస్థలకు సంబంధించి 300 పోస్టులకు సైతం..

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. దసరా కానుక అందించేందుకు సిద్ధమవుతోంది. మరో డీఎస్సీ ప్రకటనకు కసరత్తు చేస్తోంది. కొత్త డీఎస్సీ ప్రకటన కోసం పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల ఖాళీల వివరాలను సేకరించింది. ఎన్ని పోస్టులు అవసరమో గుర్తించిన అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేవలం డీఎస్సీ మాత్రమే కాదు.. స్టేట్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఎస్సీఈఆర్టీ, లైబ్రేరియన్ల నియామకానికి కూడా ప్రత్యేక హోదా ఎడ్యుకేషన్ ఇవ్వనుంది. ఈ మేరకు అక్టోబర్ 15న నోటిఫికేషన్ల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.

హామీ ఇచ్చినట్టే…

తాము అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని కూటమి ఎన్నికల్లోనే హామీ ఇచ్చింది. ఆ హామీను అనుసరించి అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేలకు పైగా ఉపాధ్యాయుల పోస్టులతో భారీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏడాది కాలంలోనే ఆ పోస్టులను భర్తీ చేసింది. డీఎస్సీ 2025 ను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం… డీఎస్సీ 2026 కు శ్రీకారం చుట్టనుంది. ఈసారి డీఎస్సీలో మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, సంక్షేమం, గిరిజన గురుకుల, మోడరన్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్, దివ్యాంగ, బీసీ సంక్షేమ విద్యాసంస్థలను పోస్టులను భర్తీ చేయనుంది. దాదాపు 2500 పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

ఇతర విభాగాలకు సంబంధించి…

పాఠశాల విద్యాశాఖ గుర్తించిన ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి 2250 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. మిగిలిన విభాగాల విద్యాసంస్థలకు సంబంధించి మరో 300 పోస్టులు ఉంటాయని అంచనా. అయితే కేవలం డీఎస్సీ పోస్టులు మాత్రమే కాదు. డైట్, ఎస్సీఈఆర్టీ లెక్చరర్ పోస్టులు 160 , జూనియర్ లెక్చరర్లు 209, లైబ్రేరియన్ల పోస్టులు 100 వరకు ఉంటాయని చెబుతున్నారు. ఈ పోస్టులన్నీ ఏపీపీఎస్సీ ద్వారా భారతీయ చేయనున్నారు. అయితే ఒక్క 2026 మాత్రమే కాదు. 2027, 2028, 2029 లో టీచర్ పోస్టుల జాబితాను కూడా రూపొందించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఏపీపీఎస్సీ, పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయిన సంగతి తెలిసిందే.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. వినాయకుడి మెడలో రూ.50 వేల నోట్ల దండ.. దొంగతనానికి యత్నించిన వ్యక్తికి యువకుల షాక్!

  2.  మాదాపూర్ ఓయో రూంలో యువతి అనుమానాస్ప‌ద‌ మృతి.. ! పరారీలో భాగస్వామి

  3.  ఆర్టీసీ బ‌స్సు బోల్తా…! 20 మందికి గాయాలు…

  4. 15 గంటలు.. 170కి పైగా సీసీ కెమెరాలు.. 100 కిలోమీటర్ల ఛేజ్.. బాలుడిని కాపాడిన పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు