Homeక్రైమ్సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద విషాదం.. విధుల్లోనే పోలీస్ కానిస్టేబుల్ మృతి

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద విషాదం.. విధుల్లోనే పోలీస్ కానిస్టేబుల్ మృతి

క్రైమ్ మిర్రర్ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆయనకు భద్రత కల్పించే విధుల్లో ఉన్న 41 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ గణేష్ శనివారం మృతి చెందారు. డ్యూటీలో ఉండగానే అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలినట్లు ముంబై పోలీసులు తెలిపారు. సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది. గతంలో బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్ద కాల్పుల ఘటన కూడా చోటుచేసుకోవడంతో ఆయన నివాసం వద్ద భద్రతను మరింత పెంచారు.

శనివారం ఉదయం సల్మాన్ ఇంటి ప్రధాన గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న గణేష్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయారు. వెంటనే అక్కడున్న తోటి సిబ్బంది ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో గణేష్ గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : ఒంటరిగానే బిజెపి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు