ప్రముఖ టాలీవుడ్ నటి సురేఖ వాణికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్‌కు గురికావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కొందరు హ్యాక్ చేసి, అందులోని వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఘటనపై స్పందించిన సురేఖ వాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు.
తన సోషల్ మీడియా ఖాతాను హ్యాక్ చేసిన కొందరు వ్యక్తులు, తన వ్యక్తిగత కంటెంట్‌ను అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని కొందరు వ్యూస్, లైక్స్ కోసం ఉపయోగించుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా పేజీలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
తనకు సంబంధించిన ప్రైవేట్ కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని, ఇప్పటికే ప్రచారం చేసిన వారు వెంటనే తొలగించాలని సురేఖ వాణి స్పష్టం చేశారు. ఒక వ్యక్తి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.
ఈ ఘటనను సాధారణ విషయంగా తీసుకునే ప్రసక్తి లేదని ఆమె హెచ్చరించారు. తన విజ్ఞప్తిని పట్టించుకోకుండా వ్యక్తిగత కంటెంట్‌ను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితానికి, గోప్యతకు గౌరవం ఇవ్వాలని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.
also read: దారుణం…కూతురితో కలిసి ఉన్న ఉద్యోగి…యజమాని చివరికి ఏం చేశాడంటే….
