Homeక్రైమ్పాక్ మహిళ హనీట్రాప్‌లో ఐఏఎఫ్ వింగ్ కమాండర్.. రహస్య సమాచారం లీక్ చేశాడా?

పాక్ మహిళ హనీట్రాప్‌లో ఐఏఎఫ్ వింగ్ కమాండర్.. రహస్య సమాచారం లీక్ చేశాడా?

క్రైమ్ మిర్రర్ : పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళతో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్న భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్‌ అధికారిపై ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. దేశ రక్షణకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆ మహిళకు చేరవేసినట్లు దర్యాప్తులో గుర్తించిన పోలీసులు.. అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే అధికారికంగా అతడి పేరును పోలీసులు వెల్లడించలేదు.

దర్యాప్తు వివరాల ప్రకారం.. సోషల్ మీడియా వేదికగా పాక్ మహిళతో వింగ్ కమాండర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం పెరిగినట్లు తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల పాటు వారి మధ్య చాటింగ్, వీడియో కాల్స్ కొనసాగినట్లు పోలీసులు గుర్తించారు. కొంతకాలానికి ఆ మహిళ సూచనల మేరకు వింగ్ కమాండర్ మరో మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి ఓ ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లు సమాచారం. ఆ యాప్ ద్వారా డేటాను సేకరించడం, ఫోన్‌లో జరుగుతున్న సంభాషణలను పర్యవేక్షించడం వంటి అవకాశాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఆ యాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.

మహిళతో సన్నిహితంగా మెలిగిన సమయంలో వింగ్ కమాండర్ పలు ఫొటోలు, వీడియోలను ఆమెకు పంపినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రక్షణ వ్యవస్థకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కూడా ఆమెతో పంచుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె అడిగిన కొన్ని కీలక వివరాలను కూడా అందించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన ఐఏఎఫ్ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో గత మే 30న ఢిల్లీ పోలీసులు అధికారిక రహస్యాల చట్టం (Official Secrets Act) కింద వింగ్ కమాండర్‌ను అరెస్టు చేశారు.

అనంతరం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించి విచారణ చేపట్టారు. పాక్ మహిళతో జరిగిన చాటింగ్, వీడియో కాల్స్, ఫొటోలు, వీడియోలు, ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులు పరిశీలించినట్లు సమాచారం. ఆమెకు ఏయే రహస్య వివరాలు చేరాయనే అంశంపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. కేసుకు సంబంధించిన ప్రధాన దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో జూలై 30న పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో విచారణ దశలో ఉంది.
also read : ఏడాది తర్వాత ఇంట్లో మహిళ అస్థిపంజరం.. బెంగళూరులో షాకింగ్ ఘటన!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు