Homeఅంతర్జాతీయంర‌ష్య‌న్‌ సైనికులు న‌ర‌మాంసం భ‌క్ష‌కులు...తోటి సైనికుల‌నే తింటున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌...!

ర‌ష్య‌న్‌ సైనికులు న‌ర‌మాంసం భ‌క్ష‌కులు…తోటి సైనికుల‌నే తింటున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్‌: తీవ్ర ఆహార కొర‌త‌తో తూర్పు ఉక్రెయిన్‌లోని ర‌ష్య‌న్ సైనికులు తోటి సైనికుల‌నే చంపుకొని తింటున్నార‌ని ఉక్రెయిన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌మ దృష్టికి వ‌చ్చిన‌ట్లు నిఘా వ‌ర్గాలు ఆరోపించాయి. 2025 నవంబర్‌లో డొనెట్స్‌ ప్రాంతంలోని మర్నోహ్రాడ్‌ సమీపంలో ఖ్రోమోయ్‌ అనే సైనికుడు తన సహచర సైనికులు ఇద్దరిని చంపి వారిలో ఒకరి కాళ్లను తినడానికి ప్రయత్నించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

నరికిన కాలు ఫొటోలను టెలిగ్రామ్‌ ద్వారా తన కమాండర్లకు ఒక గుర్తు తెలియని అధికారి షేర్‌ చేశాడు. ఒక బేస్‌మెంట్‌లో తోటి సైనికుడి శరీర భాగాలను తినేందుకు ప్రయత్నస్తున్న ఖ్రోమోయ్‌ను నిర్బంధించేందుకు ప్రయత్నించగా జరిగిన కాల్పుల్లో అతను మరణించినట్లు ఆ అధికారి తన కమాండర్లకు వివరించాడు.

చనిపోయిన సైనికుల మృతదేహాలను పరిశీలించిన ఓ సైనిక సర్జన్‌ శరీరంపై ఉన్న గాయాలు యుద్ధం వల్ల ఏర్పడిన గాయాలు కావని, పదునైన వస్తువుతో కోసినవని తెలిపారు. రష్యా సైనికులు తీవ్ర ఆహార కొరతతో అల్లాడుతున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. మరో ఘటనలో ఒక సైనికుడు తన తోటి సైనికుడు మానవ మాంసం తినడం గురించి ఫిర్యాదు చేశాడు. అతను గనక మనిషే అయితే తనకు నచ్చినంత కాలం ఇక్కడ ఉండొచ్చు.

కానీ అతను ఒక శవాన్ని తిన్నాడు అని ఆ సైనికుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నివేదికల మధ్య ఒక యూనిట్‌ కమాండర్‌ తన కింది అధికారిని నరమాంస భక్షణకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ మనుషులను తినడం ఆపండి అని ఆదేశించాడు. అయితే ఈ ఆరోపణలను లండన్‌లోని రష్యాన్‌ ఎంబసీ కొట్టివేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు