-
రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేత..!
-
భౌతికకాయానికి నివాళులు అర్పించిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సీపీఆర్ఓ, సీనియర్ జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ నిన్న సోమవారం మరణించారు. అయన పార్థివదేహంన్నీ అయన నివాసం మిర్యాలగుడ కు మంగళవారం తీసుకొచ్చారు. ఈ మరణ వార్త విన్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు…
మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్‌లో గల మధుసూదన్ నివాసానికి చేరుకున్న మంత్రి, ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి, వారిని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని తక్షణ సాయంగా కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్బంగా మాట్లాడారు.. మధుసూదన్ ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన జర్నలిస్ట్ అని మంత్రి కొనియాడారు. ఆయన మరణం జర్నలిజం రంగానికి, వ్యక్తిగతంగా తమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. మధుసూదన్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మంత్రి ప్రార్థించారు.
ప్రభుత్వం పరంగా మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. మంత్రి వెంటా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR), ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస నేత, తదితరులు మధుసూదన్‌కు నివాళులు అర్పించారు.