Homeక్రైమ్ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఏడ్చిన కొడుకు… గొంతునులిమి హత్య చేసిన తల్లి!

ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఏడ్చిన కొడుకు… గొంతునులిమి హత్య చేసిన తల్లి!

ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు సంవత్సరాల చిన్నారిని స్వయంగా తల్లే హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, చౌలి గ్రామానికి చెందిన రుచి జిందాల్ (32) జూన్ 28న తన కొడుకును గొంతు నులిమి చంపింది. ఆ సమయంలో ఆమె తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా చిన్నారి ఏడవడంతో కోపం వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

ఘటన అనంతరం, ముందు రోజు వేసిన పోలియో చుక్కల కారణంగా పిల్లాడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులను నమ్మించింది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త మురళి, రుచిని నిలదీయగా నిజం బయటపడింది.

దీంతో మురళి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి రుచిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ సంఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సంబంధాల కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

also read: హెడ్మాస్టర్ దారుణం.. చిన్నారిపై లైంగిక దాడి యత్నం – జార్ఖండ్‌లో కలకలం

తాజావార్తలు