Homeక్రైమ్వేధింపులు, బెదిరింపుల ఆరోపణలు.. ట్రైనీ ఐపీఎస్‌కు 14 రోజుల రిమాండ్

వేధింపులు, బెదిరింపుల ఆరోపణలు.. ట్రైనీ ఐపీఎస్‌కు 14 రోజుల రిమాండ్

క్రైమ్ మిర్రర్ : తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని వేధించడం, బెదిరింపులకు పాల్పడిన కేసులో శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఉల్లాపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి తొలుత కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించాడు. అనంతరం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి 2025లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు.

సోషల్ మీడియా వేదికగా తన విజయగాథకు సంబంధించిన పోస్టుల ద్వారా మరో ట్రైనీ ఐపీఎస్ అధికారిణితో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ పరిచయం స్నేహంగా మారి, అనంతరం ఇద్దరూ సహజీవనం చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.

శిక్షణ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి తన ప్రవర్తనతో బాధిత అధికారిణిని మానసికంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు. తనతో మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, ఆమె ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేయడం, నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి వ్యక్తిగత చాట్‌లను బహిర్గతం చేస్తానని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో బాధిత అధికారిణి అతనితో సంబంధాన్ని ముగించి, అనంతరం మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డి మరింత వేధింపులకు పాల్పడుతూ, నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆమెను అవమానించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అనంతరం మంగళవారం రాత్రి అరంఘర్ చౌరస్తా వద్ద ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని బుధవారం అధికారికంగా అరెస్టు చేశారు. నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు.
also read : వాహన ఫైనాన్స్ వేధింపులు తాళలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం.. కర్నూలులో కలకలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు