క్రైమ్ మిర్రర్ : ప్రేమ వ్యవహారంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఓ యువతి మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది. గొల్లప్రోలులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న ప్రిస్కిల్లా (27) కొంతకాలంగా ఓ యువకుడితో సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇంట్లో ఉన్న సమయంలో యువతి తన ప్రియుడితో వీడియో కాల్‌లో మాట్లాడిన అనంతరం విషాద ఘటన చోటుచేసుకుంది. కొంతసేపటికి ఆమె నుంచి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన సహోద్యోగి ఇంటికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే యువతి అపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
also read : యువతిపై సామూహిక లైంగిక దాడి.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయం
