HomeUncategorizedయువతిపై సామూహిక లైంగిక దాడి.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయం

యువతిపై సామూహిక లైంగిక దాడి.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయం

క్రైమ్ మిర్రర్ : రుద్రపూర్‌లో యువతిపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. 19 ఏళ్ల యువతిని అపహరించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గుర్బాజ్ అలియాస్ మను, జోగా సింగ్, రవీందర్ అనే నిందితులు బాధిత యువతిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లి భూరారాణి రోడ్డు సమీపంలోని అడవి ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన అనంతరం తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.

ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు, వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల బృందంపై వారు కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ నిందితుడి కాలికి గాయమైనట్లు వెల్లడించారు. అనంతరం ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను ఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ నిర్వహిస్తున్న సమయంలో వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు, స్థానికుల సహాయంతో వారిని వెంబడించి పట్టుకున్నారు. నిందితులు పట్టుబడిన అనంతరం స్థానికులు ఆగ్రహంతో వారిపై దాడి చేసినట్లు సమాచారం. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం కేసుపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
also read : రెండో అంతస్తు నుంచి పసికందును పడేసిన నానమ్మ.. ప్రాణాలతో బయటపడిన చిన్నారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు