HomeతెలంగాణRamayana Trailer: పాన్ ఇండియాను షేక్ చేస్తున్న ట్రైలర్..!

Ramayana Trailer: పాన్ ఇండియాను షేక్ చేస్తున్న ట్రైలర్..!

  • Ramayana Trailer: మూడు గంటల్లోనే రికార్డు వ్యూస్..

  • పాన్ ఇండియాను షేక్ చేస్తున్న రామాయణ ట్రైలర్..!

Crime Mirror, Bollywood Updates: బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం రామాయణ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ ట్రైలర్‌కు అన్ని భాషల్లోనూ అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, నటీనటుల లుక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటించగా, యశ్ రావణుడి పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపించారు. ట్రైలర్‌లో యశ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. రణ్‌బీర్ ప్రశాంతమైన రాముడి పాత్రకు సరిపోయేలా కనిపించగా, సాయి పల్లవి సీత పాత్రలో హుందాతనాన్ని ప్రతిబింబించారు.

టీజర్ విడుదల సమయంలో విజువల్స్‌పై వచ్చిన విమర్శలను పరిగణనలోకి తీసుకున్న చిత్రబృందం, ట్రైలర్‌లో మాత్రం అత్యున్నత స్థాయి విజువల్ అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది. గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు, పురాణ గాథను ఆవిష్కరించిన తీరు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.

అయితే ట్రైలర్‌లో ఒక అంశం మాత్రం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. కథలో కీలకమైన దశ వరకు చూపించినప్పటికీ హనుమంతుడి పాత్రను ఒక్క షాట్‌లో కూడా చూపించలేదు. ఈ పాత్రను సన్నీ డియోల్ పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో తొలి భాగంలో హనుమంతుడి పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరిగింది.

ఇక వ్యూస్ విషయానికి వస్తే, విడుదలైన మూడు గంటల్లోనే హిందీ ట్రైలర్‌కు 1.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తెలుగు వెర్షన్‌కు 2.72 లక్షలకు పైగా వ్యూస్ నమోదయ్యాయి. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ట్రైలర్లకు కూడా మంచి స్పందన లభిస్తోంది.

పురాణ గాథను అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రైలర్‌కు లభిస్తున్న స్పందనతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. విడుదల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు