Homeతెలంగాణతెలంగాణలో అతిభారీ వర్షాలు: స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని డిమాండ్!

తెలంగాణలో అతిభారీ వర్షాలు: స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని డిమాండ్!

క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలు ప్రజల సాధారణ జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో ప్రజా రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వాతావరణ శాఖ అత్యంత భారీ వర్ష హెచ్చరిక

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల తీవ్రత దృష్ట్యా పిల్లల భద్రతను పరిగణనలోకి తీసుకుని, అన్ని విద్యాసంస్థలకు వెంటనే అధికారికంగా సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.వర్ష ఉధృతి ఎక్కువగా ఉండటంతో నిన్న కొన్ని ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ఇచ్చాయి. రహదారులపై నీటి ప్రవాహం పెరుగుతుండటం, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో చిన్న పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు.

జపాన్‌లో ఘోర భూకంపం..18 మంది మృతి, వందలాది మంది గల్లంతు!

షుగర్ వ్యాధిగ్రస్తులకు వేప పండ్లు వరప్రసాదం.. కానీ మోతాదు మించితే ప్రమాదమే!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు