Homeజాతీయం"మా కూతురును పెళ్లి చేసుకోండి"-  సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు పెళ్లి సంబంధాల వెల్లువ

“మా కూతురును పెళ్లి చేసుకోండి”-  సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు పెళ్లి సంబంధాల వెల్లువ

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడైన అభిజీత్ దీప్కేకు వివాహ ప్రతిపాదనలు పెద్ద ఎత్తున వస్తున్నాయని ఆయన తల్లి అనితా దీప్కే వెల్లడించారు. సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు, విద్యార్థుల సమస్యలపై పోరాటంతో అభిజీత్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు పెరగడంతో పలువురు తల్లిదండ్రులు తమ కుమార్తెలకు సంబంధాలు తీసుకొస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఇప్పటికే అనేక కుటుంబాలు తమ కుమార్తెలకు అభిజీత్‌ను వరుడిగా కోరుతూ సంప్రదించాయని అనితా పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో తాము ఎలాంటి తొందరపడడం లేదని, కుమారుడి అభిప్రాయానికే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

అభిజీత్ విదేశాల్లో ఉన్న సమయంలో వివాహం గురించి పలుమార్లు చర్చించామని, కానీ ప్రతి సారి ఆయన నవ్వుతూ ఆ విషయాన్ని తప్పించుకున్నాడని ఆమె గుర్తుచేశారు. చదువు పూర్తి చేసుకుని, ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడని వివరించారు.

జనవరి 2027 నాటికి వివాహం జరగాలని కుటుంబం ఆశిస్తున్నప్పటికీ, తుది నిర్ణయం మాత్రం అభిజీత్‌కే వదిలేశామని అనితా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారని, ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబంతో కలిసి అన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

ఈ సందర్భంగా సీజేపీ ఏర్పాటుకు కారణాలపై కూడా అనితా స్పందించారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఘటన వల్ల అనేక మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల విజ్ఞప్తితో అభిజీత్ విద్యార్థులకు న్యాయం కోసం ఉద్యమాన్ని ప్రారంభించాడని చెప్పారు.

also read: కొడుకుతో బీచ్‌లో… వైరల్‌గా మారిన వీడియో…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు