నగర పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఓ పెట్రోల్ బంక్ సమీపంలో వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.
ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ఉండటంతో పాటు వేగాన్ని నియంత్రించుకోవాలని పోలీసులు సూచించారు.
also read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ లో మార్పు? కొత్త తేదీలపై ఆసక్తికర చర్చ
