క్రైమ్ మిర్రర్ : నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థిని హైదరాబాద్‌లో మృతి చెందడం విషాదం నింపింది. ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లోని అపరాజిత హాస్టల్‌లో ఉంటూ పరీక్షకు సన్నద్ధమవుతున్న యశ్విత శనివారం విషం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి కుమార్తె అయిన యశ్విత.. గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు సన్నద్ధమవుతోంది. శనివారం హాస్టల్‌లో విషం తీసుకున్నట్లు సమాచారం. విషయం గుర్తించిన తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
పరీక్షల ఒత్తిడి కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మృతికి అసలు కారణం ఏమిటనేది దర్యాప్తు పూర్తయ్యే వరకు నిర్ధారణ కాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హాస్టల్‌లోని పరిస్థితులు, యశ్వితకు సంబంధించిన ఇతర అంశాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
also read : ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణం హత్య.. రెండు నెలల పోరాటం తర్వాత కన్నుమూత
