Homeక్రైమ్ఇన్‌ఫ్లుయెన్సర్‌ దారుణం హత్య.. రెండు నెలల పోరాటం తర్వాత కన్నుమూత

ఇన్‌ఫ్లుయెన్సర్‌ దారుణం హత్య.. రెండు నెలల పోరాటం తర్వాత కన్నుమూత

క్రైమ్ మిర్రర్ : సోషల్ మీడియాలో తన వీడియోలు, నవ్వుతో అభిమానులను సంపాదించుకున్న 28 ఏళ్ల మంజీత్ కౌర్ జీవితం విషాదంగా ముగిసింది. జులైలో జరిగిన దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె.. దాదాపు రెండు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 26న కన్నుమూశారు. పంజాబ్‌కు చెందిన మంజీత్ మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇద్దరు పరిచయస్తులపై కుటుంబ సభ్యుల ఆరోపణలు

కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. జులై 3న చండీగఢ్‌లోని సెక్టార్-34 ప్రాంతంలో ఉన్న ఓ మద్యం దుకాణం వద్దకు మంజీత్‌ను ఆమెకు పరిచయమున్న ఇద్దరు వ్యక్తులు పిలిచినట్లు ఆరోపించారు. అనంతరం ఆమెను బలవంతంగా కారులో ఎక్కించి పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లా మోరిండా ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.అక్కడ మంజీత్‌పై దాడి చేసిన అనంతరం చెట్టుకు కట్టేసి నిప్పంటించినట్లు దర్యాప్తులో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మంటలు అంటుకున్న సమయంలో అక్కడికి చేరుకున్న ఆమె స్నేహితుడు వెంటనే స్పందించి దుప్పటితో మంటలను అదుపులోకి తెచ్చినట్లు సమాచారం. అనంతరం తీవ్రంగా గాయపడిన మంజీత్‌ను ఆస్పత్రికి తరలించారు.

50 శాతానికి పైగా కాలిన గాయాలు

మొదట మోరిండాలో మంజీత్‌కు చికిత్స అందించారు. అయితే కాలిన గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మొహాలీకి తరలించారు. అక్కడి నుంచి జులై 9న చండీగఢ్‌లోని పీజీఐఎమ్‌ఈఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మంజీత్ శరీరంపై 50 శాతానికి పైగా కాలిన గాయాలు కావడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు సమాచారం. చికిత్స సమయంలో కొంతకాలం ఆమె స్పృహలోకి కూడా రాలేదని తెలుస్తోంది.

కోలుకుంటుందని ఆశించిన అభిమానులు

జులై చివరి వారంలో మంజీత్ ఆరోగ్యం కొంత మెరుగుపడుతోందని ఆమెకు సన్నిహితంగా ఉండే మరో సోషల్ మీడియా వ్యక్తి వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. కోలుకున్న తర్వాత జరిగిన ఘటనపై మంజీత్ స్వయంగా సోషల్ మీడియాలో మాట్లాడుతుందని ఆయన చెప్పడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ఆగస్టు మొదటి వారంలో ఆమెకు కొంత స్పృహ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనకు ఎదురైన ఘటనకు సంబంధించిన కొన్ని విషయాలను కుటుంబ సభ్యులతో పంచుకున్నట్లు సమాచారం. అయితే ఆ తర్వాత ఆరోగ్యం మళ్లీ క్షీణించింది.

ఏడేళ్ల కుమారుడిని వదిలి..

వైద్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ మంజీత్ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆగస్టు 26న ఆమె మృతి చెందినట్లు సమాచారం. మంజీత్‌కు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. తల్లి మరణంతో ఆ చిన్నారి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఈ ఘటనపై చండీగఢ్ సెక్టార్-34 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కిడ్నాప్, హత్యతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. నిందితుల పాత్రపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
also read : డెలివరీ బాయ్ బైక్ సీజ్.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తీరుపై నెటిజన్ల ఫైర్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు