Homeజాతీయంమృత్యుంజయురాలైన ఆరేళ్ల చిన్నారి.. 3 రోజుల తర్వాత రెస్క్యూ

మృత్యుంజయురాలైన ఆరేళ్ల చిన్నారి.. 3 రోజుల తర్వాత రెస్క్యూ

క్రైమ్ మిర్రర్ : నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. భారీ వరదల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గల్లంతయ్యారు. సహాయక బృందాలు గాలింపు, సహాయక చర్యలు కొనసాగిస్తున్న వేళ.. ఓ ఆరేళ్ల బాలిక మూడు రోజుల తర్వాత శిథిలాల కింద నుంచి సజీవంగా బయటపడటం ఆశ్చర్యానికి గురిచేసింది. రసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భోటేకోశి నదికి వరద పోటెత్తడంతో గల్లంతైన వారి కోసం ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది శుక్రవారం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శిథిలాల కింద నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది.. శిథిలాలను తొలగించి బురదలో చిక్కుకున్న ఆరేళ్ల బాలికను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం బాలికను ఖాట్మండుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

హిమానీనదం కూలడంతో భారీ వరదలు

బుధవారం హిమానీనదం కూలిపోవడంతో భారీగా నీరు దిగువ ప్రాంతాలకు చేరినట్లు సమాచారం. దీంతో భోటేకోశి నది ఉద్ధృతంగా ప్రవహించి పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు, ఇతర నిర్మాణాలు దెబ్బతినడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వరదల్లో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే పలువురి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రోజుల తర్వాత చిన్నారి సజీవంగా బయటపడటం రెస్క్యూ సిబ్బందిలోనూ, స్థానికుల్లోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది.
also read : హైదరాబాద్‌లో విషాదం.. నీట్ పీజీ విద్యార్థిని మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు