Homeక్రైమ్గోదావరిలో దూకిన దంపతుల కేసు: దొడ్డసాయి మృతదేహం లభ్యం... శిరీష ఆచూకీ కోసం గాలింపు

గోదావరిలో దూకిన దంపతుల కేసు: దొడ్డసాయి మృతదేహం లభ్యం… శిరీష ఆచూకీ కోసం గాలింపు

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వద్ద దంపతులు గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.  తమ ఐదేళ్ల చిన్నారిని వంతెనపైనే వదిలి దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో దొడ్డసాయి మృతదేహం గోదావరిలో లభ్యమైంది. అయితే శిరీష ఆచూకీ ఇంకా లభించలేదు. ఆమె కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు వంతెనపై వదిలివెళ్లిన ఐదేళ్ల చిన్నారిని పోలీసులు సంరక్షణలోకి తీసుకున్నట్లు సమాచారం.

దంపతులు ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో వేల్పూరు, చించినాడ ప్రాంతాల్లో విషాదం నెలకొంది.

also read: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు, ఆటో ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు