HomeసినిమాRashmika Mandanna: గాయం నుంచి కోలుకున్న రష్మిక.. త్వరలోనే షూటింగ్‌కు రీఎంట్రీ!

Rashmika Mandanna: గాయం నుంచి కోలుకున్న రష్మిక.. త్వరలోనే షూటింగ్‌కు రీఎంట్రీ!

టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. కొంతకాలంగా తుంటి గాయం కారణంగా షూటింగులకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకున్న ఈ కన్నడ భామ.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. త్వరలోనే తిరిగి కెమెరా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఇటీవల తన కొత్త సినిమా ‘మైసా’ షూటింగ్ సమయంలో రష్మికకు తుంటి ప్రాంతంలో గాయం అయినట్లు సమాచారం. దీంతో వైద్యుల సూచన మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. షూటింగ్‌లకు దూరంగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ, పెంపుడు జంతువులతో ఆడుకుంటూ, సినిమాలు చూస్తూ రిలాక్స్ అయ్యారు. అంతేకాదు.. ప్రార్థనలు చేయడం, పజిల్స్ పూర్తి చేయడం వంటి పనులతో ఖాళీ సమయాన్ని ఆస్వాదించారు.

ఈ మధురమైన క్షణాలకు సంబంధించిన కొన్ని ఫొటోలను రష్మిక సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే తిరిగి తన వర్క్‌లో బిజీ కానున్నానని చెబుతూ.. విశ్రాంతి రోజులను మాత్రం మిస్సవుతానని తెలిపారు.

విశ్రాంతి తన ఆలోచనలను మార్చిందన్న రష్మిక

గాయం కారణంగా తీసుకున్న బ్రేక్ తనకు జీవితాన్ని మరో కోణంలో చూసే అవకాశం కల్పించిందని రష్మిక గతంలో చెప్పుకొచ్చారు. ఎప్పుడూ షూటింగులు, ప్రయాణాలతో బిజీగా ఉండే జీవితానికి కొంత విరామం తీసుకోవడంతో ప్రశాంతంగా ఉండటంలోని విలువ తనకు అర్థమైందని ఆమె పేర్కొన్నారు.

ఇంతకుముందు నిరంతరం పనిచేస్తూ ఉన్న సమయంలో నెమ్మదించడం తనకు అసౌకర్యంగా అనిపించేదని.. అయితే ఇప్పుడు కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎప్పుడూ హడావుడిగా ఉండే జీవనశైలే తనకు కొత్తగా అనిపిస్తోందని రష్మిక అభిప్రాయపడ్డారు.

రష్మిక రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

రష్మిక తిరిగి షూటింగ్‌లకు సిద్ధమవుతున్నారనే వార్తతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. రష్మిక నటిస్తున్న తదుపరి చిత్రాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

also read: యశ్‌పై నెగెటివ్ ప్రచారం.. తల్లి పుష్ప ఘాటు వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు