Homeక్రైమ్హాస్టల్‌లో కలకలం.. మైసూరు బొండాలు తిని 61 మంది విద్యార్థులకు అస్వస్థత

హాస్టల్‌లో కలకలం.. మైసూరు బొండాలు తిని 61 మంది విద్యార్థులకు అస్వస్థత

తూర్పుగోదావరి జిల్లాలోని ఓ విద్యాసంస్థలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. కోరుకొండ మండలం దోసకాయలపల్లి సమీపంలోని విద్యాసంస్థలో శుక్రవారం ఉదయం హాస్టల్‌ విద్యార్థులు మైసూరు బొండాలు తిన్నట్లు సమాచారం.

ఆహారం తీసుకున్న కొద్దిసేపటికే 61 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డారు. దీంతో అప్రమత్తమైన విద్యాసంస్థ సిబ్బంది, విద్యార్థులను సమీపంలోని పీహెచ్‌సీకి తరలించారు. కొందరికి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు.

విషయం తెలుసుకున్న జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి పి. కోమలి ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి ఆహారమే కారణమా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఆహార నమూనాలను పరీక్షించే అవకాశం ఉంది. ఘటనపై పూర్తి వివరాలు అధికారిక విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

also read: పంజాబ్‌లో AAP నేత దారుణ హత్య.. బైక్‌పై వెళ్తుండగా వెంటాడి కాల్పులు

తాజావార్తలు