Homeక్రైమ్గ్రేటర్ నోయిడాలో విషాదం.. ఆరేళ్ల బాలిక హత్య

గ్రేటర్ నోయిడాలో విషాదం.. ఆరేళ్ల బాలిక హత్య

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఆరేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. హల్దోని గ్రామం నుంచి అదృశ్యమైన చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 28న బాలిక ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేకంగా ఐదు బృందాలను రంగంలోకి దించారు.

దర్యాప్తులో భాగంగా పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించడంతో పాటు ఇతర ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలో బాలిక అదృశ్యానికి, హత్యకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

బాలిక మృతదేహం లభించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఘటనకు దారితీసిన కారణాలు, హత్య వెనుక ఉన్న ఉద్దేశం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

also read: విశాఖలో విషాదం.. బస్సు ఢీకొని వృద్ధుడు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు