హైదరాబాద్,క్రైమ్‌మిర్రర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీఓ సదస్సు కోసం కిర్గిస్థాన్ చేరుకున్నారు. బిష్కెక్లో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు. కిర్గిస్థాన్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ రెండు రోజుల పాటు పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది.
Also Read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ లో మార్పు? కొత్త తేదీలపై ఆసక్తికర చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బిష్కెక్లో మొదటగా ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా’ సభ్యులతో సంభాషించనున్నారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ మెమోరియల్ పార్క్‌ను సందర్శించి, అక్కడ ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. ‘6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్’ ప్రారంభోత్సవ వేడుకకు కూడా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. రేపు( సెప్టెంబర్ ఒకటో తేదీ) షాంఘై సహకార సంస్థ 26వ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
Also Read: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు, ఆటో ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
