Homeక్రైమ్వట్టేపల్లిలో ఎంఐఎం కార్యకర్త దారుణ హత్య...!

వట్టేపల్లిలో ఎంఐఎం కార్యకర్త దారుణ హత్య…!

హైదరాబాద్‌, క్రైమ్‌మిర్రర్‌: హైదరాబాద్‌ పాతబస్తీలో ర‌క్తం ఏరులై పారింది. వ‌ట్టెప‌ల్లి ప్రాంతంలో ఎంఐఎంఐఎం కార్య‌క‌ర్త మ‌హ‌బూబ్ అలీ(60) దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘ‌ట‌న‌లో ఆ ప్రాంతంలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం ప్రకారం.. వట్టేపల్లిలోని అల్మాస్‌ హోటల్‌ సమీపంలో మహబూబ్‌ అలీ ఉండగా దుండగులు ఆయనను చుట్టుముట్టారు. అనంతరం కత్తులు, కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో మహబూబ్‌ అలీకి తీవ్ర గాయాలయ్యాయి.

Also Read: హాస్టల్‌లో కలకలం.. మైసూరు బొండాలు తిని 61 మంది విద్యార్థులకు అస్వస్థత

దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయిన మహబూబ్‌ అలీ సుమారు 15 నిమిషాల పాటు అక్కడే ఉన్నట్లు సమాచారం. అనంతరం స్థానికులు, పోలీసులు స్పందించి ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా హ‌త్య‌కు సంబందించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. తొలిదశ దర్యాప్తులో వ్యక్తిగత కక్షలు, కుటుంబ సంబంధాలు తదితర కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

ప్రత్యేక బృందాల ఏర్పాటు…

Also Read:పంజాబ్‌లో AAP నేత దారుణ హత్య.. బైక్‌పై వెళ్తుండగా వెంటాడి కాల్పులు

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఫలక్‌నుమా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. దుండగులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

కుటుంబాన్ని పరామర్శించిన AIMIM నేతలు..

Also Read:భార్య కాపురానికి రాలేదని దారుణం.. జైలు నుంచి వచ్చిన వ్యక్తి ఘాతుకం

మహబూబ్‌ అలీ హత్య విషయం తెలుసుకున్న AIMIM బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్‌ ముబీన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పోలీసు అధికారులను కలిసి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.హైదరాబాద్‌లో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయాలని, పాతబస్తీలో పోలీసు పెట్రోలింగ్‌ను పెంచాలని AIMIM నేతలు పోలీసులను కోరారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు