Homeఆంధ్ర ప్రదేశ్ఘోర రోడ్డు ప్ర‌మాదం...! డ్రైవ‌ర్ స‌జీవ ద‌హ‌నం....

ఘోర రోడ్డు ప్ర‌మాదం…! డ్రైవ‌ర్ స‌జీవ ద‌హ‌నం….

విశాఖ‌ప‌ట్నం,క్రైమ్‌మిర్ర‌ర్‌: జిల్లాలోని ఆనందపురం-పెందుర్తి సర్వీస్‌ రోడ్డులో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో డ్రైవ‌ర్ స‌జీవ‌ద‌హ‌న‌మైన ఘ‌ట‌న ఆప్రాంతంలో తీవ్ర విషాదంలో నింపింది. గండిగుండం సత్తరువు కూడలి వద్ద ఓ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా కాలిపోవడంతో ఘటనాస్థలంలో భయానక పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Also Read:భార్య కాపురానికి రాలేదని దారుణం.. జైలు నుంచి వచ్చిన వ్యక్తి ఘాతుకం

మంటలను అదుపులోకి తీసుకువచ్చి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఇదిలా ఉండగా.. ప్రమాదం అనంతరం లారీకి చిక్కుకున్న నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడి వివరాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు ఏ పరిస్థితుల్లో లారీని ఢీకొట్టిందనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించి.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.

Also Read:భార్య కాపురానికి రాలేదని దారుణం.. జైలు నుంచి వచ్చిన వ్యక్తి ఘాతుకం

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు