Homeక్రైమ్దారుణ ఘ‌ట‌న‌...మాన‌సిక దివ్యాంగురాలిని వైర్ల‌తో బందించి లైంగిక దాడి...

దారుణ ఘ‌ట‌న‌…మాన‌సిక దివ్యాంగురాలిని వైర్ల‌తో బందించి లైంగిక దాడి…

న‌ల్ల‌గొండ‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చిన కామాంధుల ఆగ‌డాలుమాత్రం ఆగ‌డం లేదు. చిన్న పిల్ల‌ల నుంచి మొద‌లు కొంటే వృద్దుల వ‌ర‌కు చివ‌రికి మాన‌సిక దివ్యాంగుల‌ను సైతం వ‌ద‌లడం లేదు. తాజాగా ఓ మాన‌సిక దివ్యాంగురాలిపై ఓ దుండ‌గుడు ఇంటిలో ఎవ‌రు లేని స‌మ‌యంలో ఒంట‌రిగా ఉండ‌డాన్ని గ‌మ‌నించి వైర్ల‌తో బందించి లైంగిక దాడి చేసిన ఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. ఈ అమానుష ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలు (52) తల్లితో కలిసి ఉంటోంది. 70 ఏళ్లకుపైగా వయసున్న ఆ తల్లి వైద్యం నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి వెళ్లింది.

Also Read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ లో మార్పు? కొత్త తేదీలపై ఆసక్తికర చర్చ

దీన్ని గమనించిన ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి సదరు దివ్యాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు కేకలు వేయకుండా ఇనుప వైర్లను ఆమె మెడ, కాళ్లకు బిగించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. కొద్ది సేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లి, కుమార్తె పరిస్థితిని చూసి కేకలు వేసింది. స్థానికులు వచ్చి బాధితురాలి మెడ, కాళ్లకు బిగించిన ఇనుప వైర్లను తొలగించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సదరు మహిళను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించగా, నిందితుడిగా భావిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సీఐ పీఎన్‌డీ ప్రసాద్‌ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read: హాస్టల్‌లో కలకలం.. మైసూరు బొండాలు తిని 61 మంది విద్యార్థులకు అస్వస్థత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు