Friday, March 6, 2026
Homeఆంధ్ర ప్రదేశ్స్మార్ట్‌ వ్యూహాలే అభివృద్దికి సాధ్యం

స్మార్ట్‌ వ్యూహాలే అభివృద్దికి సాధ్యం

  • వినియోగ‌దారుల‌ను అర్థం చేసుకోవ‌డ‌మే కీల‌కం
  • డా. ఎన్.బి. హర్షవర్ధన్ రెడ్డి

తిరుపతి, క్రైమ్ మిర్ర‌ర్ః

స్మార్ట్‌ వ్యూహాల‌తో ముందుకు వెళితే స్టార్టప్‌ల అభివృద్ది సుల‌భ‌మ‌ని ప్రముఖ మేనేజ్‌మెంట్ శిక్షకుడు డా. ఎన్.బి. హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.

కరకంబాడి రోడ్డులోని ఎస్‌వీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ విద్యార్థులకు “ఎఫెక్టివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫర్ స్టార్టప్స్” అంశంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

స్టార్టప్ విజయానికి మంచి ఆలోచన మాత్రమే సరిపోదని, దాన్ని సరైన మార్కెటింగ్సే,సేల్స్ వ్యూహాల ద్వారా ప్రజలకు చేరవేయాల్సి ఉంటుందని తెలిపారు. పరిచయం లేకపోవడం, పరిమిత వనరులు స్టార్టప్‌లకు ప్రధాన సవాళ్లని పేర్కొన్నారు.

వినియోగదారులను లోతుగా అర్థం చేసుకోవడం మార్కెటింగ్‌లో కీలకమని, ఉత్పత్తి ఎవరికోసం, వారి సమస్య ఏమిటి, అది ఎలా పరిష్కారం ఇస్తుందనే అంశాలపై స్పష్టత ఉండాలని చెప్పారు.

మార్కెటింగ్‌ను ఖ‌ర్చుగా కంటే పెట్టుబ‌డిగా చూడాలి…
మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఉత్పత్తులతో పోలిస్తే ప్రత్యేకతను స్పష్టంగా వివరించగలిగితేనే వినియోగదారులు ఆకర్షితులవుతారని అన్నారు.

స్టార్టప్‌లకు డిజిటల్ మార్కెటింగ్ శక్తివంతమైన సాధనమని తెలిపారు.
లీడ్ పొందడం నుంచి కస్టమర్‌గా మార్చే దశ వరకు ప్రతి ప్రక్రియను ట్రాక్ చేయాలని సూచించారు.

డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే వ్యూహాలు మరింత మెరుగవుతాయని, తప్పులను అంగీకరించి త్వరగా నేర్చుకునే సామర్థ్యం విజయానికి దారి తీస్తుందని చెప్పారు.

మార్కెటింగ్‌ను ఖర్చుగా కాక పెట్టుబడిగా చూడాలని, సరైన వ్యూహంతో చేసిన మార్కెటింగ్ స్టార్టప్‌ను చిన్న ఆలోచన నుంచి పెద్ద బ్రాండ్‌గా మార్చగలదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సమన్వయకర్త డా. కాలేషా మస్తాన్ వలి, హెచ్‌ఓడి డా. ఎం. నీరజ, మిస్టర్ నాగరాజ నాయుడు, డా. టి. సిరీష, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments