Friday, March 6, 2026
Homeజాతీయంమైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్ గా తమన్నా.. రాజకీయంగా ఫుల్ చర్చ!

మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్ గా తమన్నా.. రాజకీయంగా ఫుల్ చర్చ!

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- హీరోయిన్ తమన్నా మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా కర్ణాటక ప్రభుత్వం నియమించడంపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రాజకీయ దుమారం రేగుతోంది. కర్ణాటక సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉండగా ముంబై స్వస్థలమైనటువంటి తమన్నాను తీసుకోవడమేంటి అని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం కన్నడలో పాపులర్ నటిమణులు ఉన్నారు. రష్మిక,శ్రీనిధి శెట్టి,పూజా హెగ్డే,రుక్మిణి వంటి స్టార్ హీరోయిన్లు ఉండగా ఇతర భాష నటులైనటువంటి తమన్నాను తీసుకోవడమేంటి అని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాంగ్రెస్ కన్నడ వ్యతిరేక మనస్తత్వానికి పూర్తిగా ఇదే నిదర్శనం గా నిలుస్తుంది అని తాజాగా బీజేపీ ఎంపీ సుధాకర్ కీలక ఆరోపణలు చేశారు. ఈ మైసూర్ శాండిల్ సోప్ లను ప్రభుత్వ సంస్థ అయినటువంటి కెఎస్డిఎల్ తయారుచేస్తుంది అని.. కానీ బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రం ఇతర భాష నటులను పెట్టడం ఏంటి అని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటక రాజకీయ చర్చలలో ఇది ఒక ట్రెండింగ్ చర్చగా మారిపోయింది.

భారత జట్టుపై శ్రీలంక క్రికెట్ ప్లేయర్ సంచలన ఆరోపణలు?

శ్రీశైలంలో భక్తులపై లాఠీ చార్జి.. బీజేపీ ప్రెసిడెంట్ రియాక్షన్ ఇదే?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments