Friday, March 6, 2026
Homeక్రీడలుభారత జట్టుపై శ్రీలంక క్రికెట్ ప్లేయర్ సంచలన ఆరోపణలు?

భారత జట్టుపై శ్రీలంక క్రికెట్ ప్లేయర్ సంచలన ఆరోపణలు?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత క్రికెట్ జట్టు పై తాజాగా శ్రీలంక క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్ష భారత క్రికెట్ ప్లేయర్లపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల క్రికెటర్ల బ్యాట్స్ కంటే ఇండియా క్రికెటర్ల బ్యాట్లు పవర్ ఎక్కువగా జనరేట్ చేస్తున్నాయి అని ఆరోపించారు. ఒక విధంగా చెప్పాలంటే మాకు దొరికే బెస్ట్ బ్యాట్స్ కంటే ఇండియన్ క్రికెట్ ప్లేయర్ల బ్యాట్లు చాలా మెరుగైనవి అని వ్యాఖ్యానించారు. భారత జట్టు క్రికెటర్లు ఆడేటువంటి బ్యాట్స్ పై రబ్బరు లేయరు ఉంటుంది అని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఇప్పటికీ ఇది ఎలా సాధ్యమో నాకు కూడా తెలియట్లేదు అంటూ.. భారత క్రికెటర్లు ఉపయోగించేటువంటి బ్యాట్లు మాకు దొరకవు అని.. ఆరోపించారు. ఇక చివరిగా ఈ విషయం ప్రతి ఒక్క ఆటగాడికి తెలుసు అని వ్యాఖ్యానించడం ప్రతి ఒక్కరిని కూడా షాకింగ్ కు గురి చేసింది. ఇన్నాళ్లుగా ఈ విషయంపై ఎవరికీ కూడా ఒక అవగాహన కూడా లేదు. కానీ సడన్ గా ఇవాళ శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్ష చేసినటువంటి ఈ బ్యాట్ ట్యాంపరింగ్ ఆరోపణలు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేలా చేసింది. మరి ఈ విషయంపై భారత జట్టు క్రికెటర్లు ఎలా స్పందిస్తారు అనేది కాస్త ఆసక్తికరంగా మారింది.

కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన అభిషేక్ శర్మ.. ఆ ప్లేయర్ కు అవకాశం?

శ్రీశైలంలో భక్తులపై లాఠీ చార్జి.. బీజేపీ ప్రెసిడెంట్ రియాక్షన్ ఇదే?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments