Homeక్రీడలుGT కి వెళ్లాలనుకున్న హార్దిక్.. ట్విస్ట్!

GT కి వెళ్లాలనుకున్న హార్దిక్.. ట్విస్ట్!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఏ జాతీయ లేదా ఫ్రాంచైజీలో కొనసాగుతాడనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, పాండ్యా తిరిగి గుజరాత్ టైటాన్స్ గూటికి చేరేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన గుజరాత్ టైటాన్స్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం మరియు ప్రస్తుత కెప్టెన్ శుభమాన్ గిల్ సైతం హార్దిక్ పాండ్యా రాకకు సానుకూలంగా స్పందించారని వార్తలు వస్తున్నాయి. ఇరు పక్షాలు తిరిగి కలుసుకునేందుకు సుముఖంగా ఉండటంతో, పాండ్యా రీ-ఎంట్రీ దాదాపు ఖాయమనుకున్న తరుణంలో ఒక పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది.ఈ డీల్ కు ఒక ప్రధాన అడ్డంకి ఏర్పడినట్లు తెలుస్తోంది. తనకే మళ్ళీ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలన్న నిబంధనను హార్దిక్ పాండ్యా విధించాడట. దీనికి ఫ్రాంచైజీ సుముఖంగా లేకపోవడంతో, ప్రస్తుతానికి ఈ ఒప్పందం రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది.గమనించాల్సిన విషయం ఏమిటంటే, 2022లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ప్రారంభమైన తొలి ఏడాదే, హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఆ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి తమ తొలి ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కు మారిన ఆయన, ఇప్పుడు తిరిగి GT వైపు మొగ్గు చూపడం, కెప్టెన్సీ వివాదంతో డీల్ క్యాన్సిల్ అవ్వడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

పవన్ కళ్యాణ్ ‘OG-2’ అప్‌డేట్: వాయిదాల్లేవు.. అనుకున్న టైమ్‌కే షూటింగ్ షురూ!

రోజా అరెస్ట్?!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు