Homeక్రీడలుKKR క్రికెటర్ రమణ్‌దీప్ సింగ్ పెళ్లి.. టీవీ నటి చార్లీ చౌహాన్‌తో కొత్త జీవితం!

KKR క్రికెటర్ రమణ్‌దీప్ సింగ్ పెళ్లి.. టీవీ నటి చార్లీ చౌహాన్‌తో కొత్త జీవితం!

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) క్రికెటర్ రమణ్‌దీప్ సింగ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ టీవీ నటి చార్లీ చౌహాన్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. సిక్కు సంప్రదాయ పద్ధతిలో గురుద్వారాలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంప్రదాయ దుస్తుల్లో రమణ్‌దీప్, చార్లీ చౌహాన్ జంటగా ఎంతో అందంగా కనిపించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో ఇరువురూ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. పెళ్లి ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక చార్లీ చౌహాన్ విషయానికి వస్తే.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆమెకు బుల్లితెరపై మంచి గుర్తింపు ఉంది. 2009లో ‘రోడీస్’ రియాలిటీ షో ద్వారా ఆమె టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు హిందీ టీవీ కార్యక్రమాలు, సీరియళ్లలో నటిస్తూ ప్రేక్షకులకు చేరువయ్యారు.

చార్లీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి గతంలో నటుడు కున్వర్ అమర్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కొంతకాలం వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై చర్చ జరిగినప్పటికీ.. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయినట్లు సమాచారం.

ప్రస్తుతం రమణ్‌దీప్ సింగ్, చార్లీ చౌహాన్ వివాహంతో అభిమానుల దృష్టి ఈ కొత్త జంటపై పడింది. సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు, సినీ-క్రికెట్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

also read: సికింద్రాబాద్‌లోని స్పోర్ట్స్ షాప్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు